* కడియం శ్రీహరి పదవుల కక్కుర్తి కోసం పార్టీ మారాడు
* బ్లాక్ మెయిల్ చేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారు
– ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆకేరు న్యూస్ , వరంగల్ : జైలుకైనా వెళతాను.. కాని పార్టీ మాత్రం మారను. కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడేది లేనేలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయార్ రావు ( Errabelli Dayakar Rao ) అన్నారు. పాలకుర్తిలో బీఆర్ ఎస్ పార్టీ రైతు దీక్షలో దయాకర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ఖజానాలో డబ్బులే లేవు. పదేండ్ల కాలంలో రైతులు ఎంతో సుభిక్షంగా ఉన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ లో నీటి లభ్యత ఉంది. ధర్మసాగర్, స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నప్పటికి రైతులకు నీళ్ళు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ Congress Party ) పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీటి నిర్వహణ సరియైన విదంగా చేయకపోవడం వల్ల రైతుల పంటలు దారుణంగా ఎండిపోయినాయి. రెండు లక్షల రుణమాఫీ అన్నారు. క్వింటాకు ఐదు వందల బోనస్ అన్నారు. దాన్ని మరచి పోయారు. గత ఏడాది వర్షాలు సరిగా పడక పోవడం వల్లనే రైతులకు ఈ కష్టాలు వచ్చయని కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చెబుతోంది. నిజానికి గత ఏడాది విపరీతంగా వర్షం పడిందని దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ సృష్టించిన కరువు వల్ల ఇప్పటికే 216 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారన్నారు. ఇదీ అబద్దం రైతులెవరూ చనిపోలేదు..చనిపోయిన రైతుల పేర్లతో జాబితా ఇవ్వండని కాంగ్రెస్ వాళ్లు సవాల్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల లిస్ట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ మంత్రులు నోరు మూసుకున్నారన్నారు.
* జైలు కైనా వెళతా.. పార్టీమాత్రం మారను.
కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తోంది. కేసులు పెడతామని చెప్పి పార్టీలో చేర్చుకుంటున్నారు. కడియం శ్రీహరి లాంటి వాళ్ళు మాత్రం పదవుల కోసం కక్కుర్తి పడి పార్టీ మారారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ బండారం బయటపుతుంది. రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతాడు. మోసం చేస్తాడు. ప్రజలకు తొందరలోనే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడుతుందన్నారు. నేను ఇప్పటికే మూడు సార్లు ప్రజల కోసం జైలుకెళ్ళాను. మరో సారి జైలుకు పంపిస్తానని నన్ను బెదిరిస్తున్నారు. అవసరమైతే మరో సారి జైలుకు వెళతాను. పార్టీ మాత్రం మారేది లేదు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా నే పోటీ చేస్తాను. బీఆర్ ఎస్ పార్టీని టీఆర్ ఎస్ పార్టీగా మార్చేందుకు ఆలోచనచేస్తున్నామని దయాకర్ రావు అన్నారు.
————————