* జైలు వార్డెన్‌ను సుత్తితో కొట్టి..
* చోడవరం జైలులో ఘటన
ఆకేరు న్యూస్, అమరావతి : రిమాండ్ ఖైదీలు ఇద్దరు జైలు నుంచి పరారైన ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి రోజూ మాదిరిగానే శుక్రవారం సాయంత్రం జైలు గది నుంచి వంట గదికి భోజనం తయారీకి రిమాండ్ ఖైదీలైన నక్కా రవికుమార్, బెజవాడ రాములును తీసుకొచ్చారు. ఈ క్రమంలో రిమాండ్ ఖైదీలిద్దరు వంట గది నుంచి ఒక్కసారిగా సుత్తితో బయటకు వచ్చారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన జైలు వార్డెన్ వి.వీర్రాజుపై దాడి చేశారు. అనంతరం వీర్రాజు నుంచి రాము తాళాలు లాక్కొని ప్రధాన ద్వారం తెరిచాడు. వెంటనే ఇద్దరు రిమాండ్ ఖైదీలు బయటకు పారిపోయారు. ఈ దాడిలో గాయపడిన వార్డెన్ వీర్రాజుకు ప్రథమ చికిత్స చేయించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కారాగారానికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. పారిపోయిన వారిని పట్టుకునేందుకు విశాఖ, అల్లూరి, విజయనగరం జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. కాగా, రవికుమార్ పింఛన్ నగదు కాజేశాన్న నేరారోపణపై అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో అరెస్టయి ఇక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. రాము దొంగతనం కేసులో మాడుగుల పోలీస్ స్టేషన్లో అరెస్టయ్యాడు.
……………………………….
