
* టిడిపి మండల అధ్యక్షులు చిలువేరు అన్నమయ్య.
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని ఏటురునాగారం,పసర ఫారెస్ట్ టోల్ గేట్ ఎత్తివేయాలని టీడీపీ పార్టీ ఏటూరు నాగారం మండల కమిటి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న టోల్ గేట్ దగ్గర రాస్తారోకో చేశారు.ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు అన్నమయ్య మాట్లాడుతు గతంలో ఈపాస్ టాగ్, టోల్ గేట్ ఇసుక లారీలకు మాత్రమే అన్నారు. ప్రస్తుతం ఫోర్ వీలర్ వాహనంతో పాటు మరికొన్ని వాహనాలకు సుమారుగా 100 రూపాయలు వసూలు ఇచ్చేస్తున్నారు. లోకల్ వాహనా ఎటువంటి ఫీజు లేదని ఫారెస్ట్ అధికారు చెప్పారు. అయినప్పటికీ మళ్లీ అదే వంద రూపాయలు కట్ అయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మారుమూల గ్రామాలకు రోడ్లు వేయడానికి అటవి శాఖ పర్మిషన్ ఇవ్వడంలేదని ఆరోపించారు. ఈ టోల్ గేట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
60 కిలోమీటర్లకు ఒక టోల్గేట్ ఉండాలి. అలాకాకుండా మచ్చాపూర్ నుంచి ఏటూర్ నాగారం వరకు మూడు టోల్ గేట్స్ ఉండడం వల్ల వాహనదారుల మీద భారంమోపి డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. వాహనదారులు వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి కంకణాల రామ్మూర్తి, తెలుగు నాడు యువత కోకిల శివ కేశవ, గండపల్లి నరేష్, దబగట్ల రాంబాబు, చిలువేరు చిన్న వినయ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………