* లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: లక్షలాది ముందే తనను పెళ్లిచేసుకుని భార్యగా తనను నందమూరి తారక రామారావు ఇంటికి తీసుకొచ్చారని లక్ష్మీపార్వతి (Lakshmi Parvathi) అన్నారు. అయినప్పటికీ తనను 30 ఏళ్లుగా ఆ దుర్మార్గులు వేధిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళి అర్పించారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘29 ఏళ్లుగా ఎన్టీఆర్‌కు దూరమై మనోవేదనకు గురవుతున్నా. నా ఫోన్ నంబర్‌ను ఎవరో టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారు. నిన్నటి నుంచి వరుసగా వెయ్యికిపైగా బెదింపు కాల్స్ వస్తున్నాయి. మీరు అనుకున్నా.. అనుకోకున్నా నేను మీ అత్తగారిని కాదా చంద్రబాబు. ఇలాంటి అవమానం నాకు జరుగుతుందే మీరు చూస్తూ ఉంటారా?. మీకు బాధ్యత లేదా?. తన పై మీకు ఎందుకు కక్ష ఎందుకు‘ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ నా జీవితాన్ని నాశనం చేయడానికి కొందరు దుర్మార్గులు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
……………………………………….