
* మాజీ మంత్రి హరీవ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (HarishRao) విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంపై ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను, నిరుద్యోగులను పోలీసులతో కొట్టించడం, ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఇదేనా మీరు చెప్పిన ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్ అంటూ నిలదీశారు. ఇవాళ ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రజాపాలన పేరుతో పెద్ద ట్రాన్స్ ఫార్మేషన్ చేశారని ఎద్దేశా చేశారు. 20శాతం కమీషన్లు తీసుకోవడమేనా? మీరు చెప్పిన ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అంటూ ధ్వజమెత్తారు. గవర్నర్ మహాత్మా గాంధీ (Mahatma Gandhi) చెప్పిన మాటలతో 32 పేజీల ప్రసంగం మొదలు పెట్టారని.. ‘నిన్ను నువ్వు కనుగొనడానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నమవ్వడమే’ అని అన్నారని, నిజానికి రేవంత్ రెడ్డి (Revanthreddy) అత్యుత్తమ మార్గం ఢిల్లీ, చంద్రబాబు సేవలో నిమగ్నం అయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చారని.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట రాహల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారని ఆరోపించారు. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి చేపట్టిన చర్యలుగా భావించాలా? అని ప్రశ్నించారు. వ్యవసాయం పెంచింది ఎవరు.. గొప్పలు చెబుతున్నది ఎవరు? అని నిలదీశారు.34లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాల మాగాణంగా మార్చింది కేసీఆర్ (KCR) కాదా? ప్రశ్నించారు.
…………………………………………