
– మూడు గ్రామాలకు ఆర్వో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకై హామీ
– బాట మరమ్మతుల కోసం 5 లక్షలతో అభివృద్ధి పనులకు హామీ
– కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ, బండి సంజయ్ కుమార్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కేంద్రమంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి పనుల కోసం ఆదివారం కమలాపూర్ బిజెపి నేతలు ఎంపీ బండి సంజయ్ ను కరీంనగర్లో కలిశారు. వెంటనే స్పందించిన మంత్రి బండి సంజయ్ మండలంలోని పంగిడిపల్లి,నేరెళ్ల, ఉప్పులపల్లి మూడు గ్రామాలకు ఆర్వో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకిై హామీ ఇచ్చారు. అలాగే ఉప్పులపల్లె, బీంపల్లి గ్రామాల రైతులకు వారు పొలాలకు వెళ్లే బాట మరమ్మత్తుల కోసం ఎంపీ నిధుల ద్వారా ఐదు లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చారని బిజెపి నేతలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కమలాపూర్ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకురావడానికి నిధులను కేటాయించి తన వంతు సహకారాన్ని అందిస్తానని, ఓట్లేసిన ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి వలిగే సాంబారావు,మండల ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు అక్కినపల్లి రవీందర్, సీనియర్ నాయకులు సముద్రాల మొగిలి పాల్గొన్నారు.
………………………………………..