
* సైనిక స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్
* యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు శంకుస్థాపనలో రేవంత్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుందని…తన బ్రాండ్ యంగ్ ఇండియా అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఇది ప్రతీ పోలీస్ సిబ్బందికి అత్యంత ముఖ్యమైనదని, ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా, మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీలకు పునాదులు పడ్డాయని, నెహ్రూ దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందన్నారు. దేశ చరిత్రలో ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ అందులో కొద్దిమంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని అన్నారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయని, ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారని, హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబునాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్‌ను గుర్తుంచుకుంటారని, అలాగే ఇవాళ తాను క్రియేట్ చేసిన తన బ్రాండ్ ’యంగ్ ఇండియా’ మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్‌ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామన్నారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని, అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది మా బ్రాండ్ అని, నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. పోలీస్ స్కూల్ కోసం రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలని.. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీనీ బెస్ట్ యూనివర్సిటీగా రూపొందిస్తాం
యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీనీ బెస్ట్ యూనివర్సిటీగా రూపొందిస్తాం.. రాజకీయ ఆలోచనలు చేయలేదు స్కిల్ యూనివర్సిటీలో.. సక్సెస్ ఉన్న కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి.. యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీలో చేరిన వాళ్ళకి 100 శాతంఉద్యోగాలు వచ్చాయి.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ-లో కూడా పెద్ద కంపెనీలు పోటీపడుతున్నాయి.. పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ అత్యంత ముఖ్యమైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 16నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు. యంగ్ ఇండియాలో చదువు, ఉపాధే నా బ్రాండ్. కొందరు ఉద్యమ నేతలం, తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు. దేశానికే దార్శనికుడు పీవీ నరసింహారావు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని స్థాపించాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. యంగ్‌ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్‌ను సమకూర్చుకోవాలి. నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రేవంత్‌రెడ్డి తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కనీస వసతులు లేవు.. ప్రతి నియోజక వర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం.. 25 ఎకరాల్లో స్కూల్.. ప్రతీ స్కూల్ కి 200 కోట్లు.. విద్యా విధానంలో చిన్న గ్యాప్ ఉంది.. ప్రైవేటు- స్కూల్ లో విద్యార్ధులు ఎక్కువ.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యావంతులు.. కానీ ఇక్కడ చదివే పిల్లలు 18 లక్షల మందే చదువుతున్నారు.. నర్సరీ.. కూడా ప్రభుత్వ స్కూలులో ఏర్పాటు చేయాలని.. ప్లే స్కూల్ పెట్టాలని మా ఆలోచన.. త్వరలోనే అమలులోకి తెస్తాం.. సైనిక్ స్కూల్‌తో మనం పోటీ పడాలని అన్నారు.నేను ఉన్నంత కాలం విూకు నిధులు.. అనుమతులకు లోటు ఉండదని అన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, కమిషనర్ సివి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………