* ఇందిరగాంధీ జయంతి రోజున పంపిణీ
ఆకేరు న్యూస్, ములుగు: ఇందిరాగాంధీ మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇందిరా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని స్వయం సహాయక సంఘాలు మహిళలకు రెండేసి చీరలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ములుగు జిల్లాలో ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయo గోదాంకు చీరలు చేరుకున్నాయి. చీరల డిజైన్లను చేనేత శాఖ ఆధ్వర్యంలో టేస్కో రూపొందించిoది. ఇందిరమ్మ చీరలను మంగళవారం ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. నాణ్యమైన చీరలను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్వశక్తి మహిళలకు ఏడాదికి రెండు చీరలు ఇచ్చే విధంగా వస్త్ర పరిశ్రమకే ప్రభుత్వం ఎక్కువ ఆర్డర్ ఇచ్చిందన్నారు. నేతన్నలకు ప్రభుత్వం అందిస్తున్న వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు ఉపాధి భరోసానిస్తున్నాయని,గతంలో జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిన అనేక మంది కార్మికులు ఇప్పుడు గ్రామాల్లోని చేతి వృత్తుల్లో నిమగ్నమయ్యారు. దీంతో వస్త్ర పరిశ్రమలో మర మగ్గాల చప్పులు మొదలయ్యాయి. నేతన్నలకు చేతినిండా పని దొరుకుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్సవడ్ల వడ్ల వెంకన్న,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్,బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి ప్రధాన నరసింహారావు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు సర్వ అక్షిత్ కుమార్. పడిదల హనుమంతు. పోలబోయిన గోపాల్. గంపల శివకుమార్ ఎల్లయ్య. సర్వ సాయికుమార్. తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………..
