*127 పోలింగ్ కేంద్రాలు
* 407 పోలింగ్ బూత్ లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం అధికారులు సర్వం సిద్దం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొతం 127 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 407 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఒక్కో పోలింగ్ బూత్‌కి నాలుగు చొప్పున 1,628 బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. అదనంగా 20 శాతం బ్యాలెట్ యూనిట్లను సిద్ధంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలో భాగంగా 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.
………………………………………………
