
* కాళేశ్వరం రిపోర్టుపై హరీష్ రావు ఫైర్
* తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ( ( kaleshweram project) పై జస్టిస్ పిసి ఘోష్(justice pc ghosh) ఇచ్చిన రిపోర్టు అంతా ట్రాష్ అని అది భోగస్ రిపోర్ట్ అని హరీష్ అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో(telangana bhavan) కాళేశ్వరం రిపోర్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (power point presentaion) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ (revanth reddy) సర్కార్ ప్రజా సంక్షేమాన్ని గాలికి ఒదిలేసి రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఓ వైపు రైతులు యూరియా బస్తాల కోసం తండ్లాడుతుంటే వారికి సకాలంలో యూరియా (uria)పంపిణీ చేయలేని స్థితిలో రేవంత్ సర్కార్ ఉందన్నారు.హాస్టల్ పిల్లలు ఫుడ్ పాయిజన్ కు గురై ఆస్పత్రుల పాలవుతున్నారని హరీష్ అన్నారు. ఫీజి రీయింబర్సు మెంట్ అందక పోవడంతో విద్యార్థుల్లు పాఠశాలల్లో కళాశాలల్లో ఉండకుండా రోడ్లపై ధర్నాలు చేసే పరిస్థితి ఉందన్నారు. నిరుద్యోగాలు ఉద్యాగాల కోసం ఆందోళనలు చేస్తున్నారని హరీష్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు ఇచ్చిన బ్రీఫ్ రిపోర్టును జిల్లాల్లో బీ ఆర్ ఎస్ నాయకులు చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రజలకు నిజాలు తెలియజేయడానికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నట్లు హరీష్ తెలిపారు. కాళేశ్వరం విషయంలో సీఎంగా కేసీఆర్ తన బాధ్యతను నిర్వర్తించారని అందులో రాజకీయ జోక్యం చేసుకోలేదని హరీష్ అన్నారు.
కమిషన్ల సర్కార్…
రాష్ట్రంలో కమిషన్ల సర్కార్ నడుస్తోందని ఏ పని కావాలన్నా అధికారులకు కమిషన్లు ముట్టచెప్పనిదే పనులు కావని హరీష్ అన్నారు. అంచాల కమిషన్లు ఒక వైపు రాజకీయ కక్షసాధింపు కమిషన్లు ఒక వైపు నడుస్తున్నాయని హరీష్ పీసీ ఘోష్ కమిషన్ ఉద్దేశించి అన్నారు. 650పేజీల రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. కాళేశ్వరం నివేదికలో నచ్చిన పేరాలను లీక్ చేశారని… నచ్చని నాయకులను బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు
కేంద్రప్రభుత్వాన్ని తప్పు పట్టినట్లే …
కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం అని హరీష్ అన్నారు. కేంద్ర టెక్నికల్ అడ్వైజరీ కమిటీని(technical advisary committee) తప్పుపట్టినట్లు అన్నారు. ఎంతో మంది ఇంజినీర్లు దీని వెనుక ఉన్నారని వారందరినీ తప్పుపట్టినట్లేనని హరీష్ అన్నారు. కాళేశ్వరం రిపోర్టు కేసీఆర్(kcr) పై కుట్రతో తయారు చేసిన రిపోర్టు అని హరీష్ అన్నారు. ఇలాంటి రిపోర్టులు న్యాయస్థానాల్లో నిలబడవని,ప్రజాకోర్టులో నిలబడవనిహరిష్ అన్నారు. ఇందిరా గాంధి పై జనతా ప్రభుత్వం వేసిన షా కమిషన్ కూడా దురుద్దేశంతో వేసిందే అని హరీష్ అన్నారు. దేశంలో ఇలాంటి రిపోర్టులు గతంలో ఎన్నో వచ్చాయని అవేవీ ప్రజాకోర్టులో న్యాయస్థానాల్లో నిలబడలేదని హరీష్ తెలిపారు.పోలవరం మూడుసార్లు కూలినా ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మేడిగడ్డకు మాత్రం ఎన్డీఎస్ఏ మూడు సార్లు వచ్చిందని ఫైర్ అయ్యారు. ఇది కాంగ్రెస్, బీజేపీ కుటిల రాజకీయమని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ డిజైన్ చేసిన కాంగ్రెస్‌పైనే మెదట చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ మంత్రి హరీష్‌రావు.
అసెంబ్లీలో తేల్చుకుందాం
కాళేశ్వానికి కేంద్రం ఇచ్చిన అనుమతులు చూపిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటారని హరీష్ ప్రశ్నించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా కడిగేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. మైక్ కట్ చేసి పారిపోకూడదని సవాల్ విసిరారు. కాళేశ్వేరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ చేయకుండా ఎలా ఉంటారని.. కేసీఆర్ కూడా అదే చేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కూడా కేసీఆర్ సొంత నిర్ణయంగా రేవంత్ ప్రభుత్వం ఎలా చెబుతోందని నిలదీశారు. సీడబ్ల్యూసీ అనుమతి, కేబినెట్ నిర్ణయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సంస్థ కూడా మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ కట్టవచ్చని చెప్పిందని మాజీ మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు.
………………………………………..