
ఆకేరున్యూస్, హైదరాబాద్ : శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన రథం ఊరేగింపులో కరెంట్ షాక్ కు గురై ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని రోడ్డుపక్కన నిలిపివేశారు. అనంతరం యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు.ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథం లాగుతున్న తొమ్మిది మందిలో ఐదుగురు అక్కడిక్కకడే మృతిచెందగా.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మరొకరు మృతిచెందారు. కాగా బాధిత కుటుంబాలు శోకసముద్రంలో ఉన్నాయి. ఈ ఘటనతో రామాంతాపూర్ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
………………………….