
* ఇద్దరు కార్మికుల మృతి
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మిసన్ భగీరథ నిర్మాణ పనుల్లో భాగంగా సంపులోకి వెళ్లిన
ఇద్దరు కార్మికులు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో సంపు నిర్మాణ పనులు చేపట్టారు. మంగళవారం స్లాబు వేస్తున్న
క్రమంలో మోటారు వేసేందుకు సంపు కిందకు వెళ్లిన కాకా మహేశ్ (36), లింగాపురం
పాడుకు చెందిన నీలం తులసీరాం (37) నీటిలో పడి ఊపిరాడక ప్రాణాలు
కోల్పోయారు. సంఘటన స్థలికి చేరుకున్న సీఐ రాజు వర్మ, తహసీల్దార్
శ్రీనివాస్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………..