
* ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి
ఆకేరున్యూస్, మహబూబాబాద్: తెలంగాణలో వ్యాప్తంగా రైతులు యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. యూరియా దుకాణాల ముందు గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. ఈ నేపధ్యంతో యూరియా కొరతపై ఆగ్రహించిన రైతులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మరళీనాయక్ క్యాంప్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన రెడ్డియాల,కంబాలపల్లి గ్రామాలకు చెందిన రైతులు యూరియా లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహంతో పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. యూరియా ఇచ్చేదాకా కదిలేదు లేదని నినాదాలు చేశారు. పోలీసులు రైతుల నివారించేందుకు ప్రయత్నించగా క్యాంప్ కార్యాలయ గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం గేట్లకు తాళాలు వేశారు. రైతుల ఆందోళన గురించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మురళీ నాయక్ అధికారులతో మాట్లాడి రైతులకు యూరియా అందేవిధంగా చూడాలని ఆదేశించారు. పోలీసులు కలుగజేసుకొని రైతులను శాంతింపజేశారు.
……………………………………..