
* రాకపోకలు బంద్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. చేగుంట-గజ్వేల్ ప్రధాన రహదారిలోపై అయిదు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. రహదారికి అడ్డంగా ముళ్లకంచె వేసి రాకపోకలను నిలిపేశారు. నీరందక వందల ఎకరాలు ఎండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల మందు, రైతు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. రహదారిపై టెంటు వేసి బైఠాయించారు. రైతుల నిరసనతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
……………………………….