ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
పంటలు ఎండకుండా కాపాడేందుకు మల్లన్న గండి రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేయడంతో జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్టలోని వెంకటాద్రి చెరువు మండుటెండలో మత్తడి పోస్తుంది. రైతుల విజ్ఞప్తి మేరకు
నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు బుగుల వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో పల్లగుట్ట వెంకటాద్రి చెరువు నింపగా మత్తడి పడుతున్న దృశ్యాన్ని చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ ఎండి రఫీ, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ నాగరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు, దేవస్థానం డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి, సంపత్ రాజు, రమేష్, వెంకన్న, అశోక్ పాల్, శ్రీను, రాజు, బిక్షపతి, అంజయ్య రైతులు
తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు.
