
* తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పాయం కోటేశ్వరరావు
ఆకేరు న్యూస్, ములుగు: రైతులకు యూరియా కొరత లేకుండా సరిపడా యూరియా అందించాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పాయం కోటేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం కోసం రైతులను ఆగం చేస్తున్నారని అన్నారు.రైతు సహకార సంఘాలు,ఫర్టిలైజర్స్ షాపులలో నిబంధనల పేరుతో రైతులకు యూరియా బస్తాలను కోత విధించడం సరికాదని యూరియా దొరకక రైతాంగం ఎంతో నష్టపోతున్నారని ప్రస్తుతం వరి, పత్తి రైతులకు యూరియాతో ఎంతో అవసరం ఉందని ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని అన్నారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని రైతులకు యూరియా కష్టాలను తీర్చాలని యూరియా వస్తుందని వారం రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు.తప్ప యూరియా మాత్రం సరిపడా రావడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా అందించాలని కోరారు.
…………………………………..