
* ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరున్యూస్, జనగామ: రైతు సంక్షేమం, పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. లింగాల ఘనపూర్ మండలానికి అశ్వరావుల్లి కుడి కాలువ ద్వారా మొట్ట మొదటిసారి గోదావరి జలాలు తీసుకురాగలిగామని శ్రీహరి అన్నారు..లింగాల ఘనపూర్ మండలం సిరిపురం గ్రామంలో ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమనికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు- చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యానికి మద్దతు ధర అందించడంతో పాటు సన్నాలకు 500బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. సన్నాలకు 2320 రూపాయలు, దొడ్డు రకానికి 2300రూపాయల మద్దతు ధర అందిస్తున్నట్లు వెల్లడిరచారు. బయట మార్కెట్ లో తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకొని రైతులు నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 25లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణ మాఫీ, రైతు భరోసా, సన్నాలకు 500బోనస్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని తెలిపారు. సిరిపురం గ్రామంలో త్రాగు నీటి సమస్య ఉన్న విషయం నా దృష్టికి వచ్చిందని వారం రోజులలో త్రాగు నీటి సమస్యను పరిష్కరిస్తానని హావిూ ఇచ్చారు. అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా లింగాల ఘనపూర్ మండలంలోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందిస్తానని అన్నారు. జనగామ నుండి జీడికల్ రోడ్డు జూన్ లోగా పూర్తి చెస్తానని హామీ ఇచ్చారు.
……………………………………………………..