
* ముదిరిపోతున్న వరి నారుమడులు
ఆకేరు న్యూస్, ములుగు: వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరి నారుమడులు ఎండి పోతున్నాయి. ఖరీఫ్ సీజన్లో రైతులు మొక్కజొన్న,వరి, పత్తి తదితర పంటలు మొక్కదశలోనే మాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు మేఘాలు మేఘావృత్తమై కమ్ముకుంటున్నాయి. పూర్తిస్థాయిలో వర్షాలు కురవక చెరువుల్లోకి నీరు రాకపోవడంతో వరి నారుమడులు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. బావుల కింద కుంటల కింద నారుమడులను కాపాడుకుంటున్నారు. వర్షాధార భూములలో పోసిన నారుమడులు ఎండిపోయే దశకు చేరుకున్నాయి . చిరుజల్లులు చినుకుల కోసం వర్షాలు లేక పంటలు ఎండిపోతాయేమోనని దిగులుతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బావుల కింద నారుమడులు ముదిరిపోయే దశకు చేరుకున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
……………………………………..