* థార్ జీపును ఢీకొట్టిన భారీ వాహనం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లోని బేగంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. థార్ జీపును భారీ లారీ ఢీకొట్టింది. మంగళవారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తున్న హేవీ లారీ.. మహీంద్రా థార్ జీపును వెనకాల నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో జీపు వెనకాల నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో హేవీ లారీ బొల్తాపడింది. థార్ వాహనంలో ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. రద్దీ ప్రదేశంలో భారీ వాహనం ప్రమాదానికి గురికావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే ట్రాపిక్కు క్లీయర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
……………………………………………………….
