* రెండు లారీలు ఢీకొని డ్రైవర్ సజీవ దహనం
ఆకేరు న్యూస్, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద 167 ఎన్ జాతీయ రహదారిపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మహబూబ్‌నగర్ నుంచి ఇథనాల్ ట్యాంకర్.. తాండూరు నుంచి ఐరన్ లోడ్‌తో లారీ వస్తోన్నాయి. ఎదురుగా వచ్చిన ఇథనాల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొంది. ఈ ఘటనతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మూడు ఫైర్ ఇంజన్లతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి. ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ అతివేగంతో నడపడంతోనే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. భార ప్రమాదం తప్పిందని ప్రజలు వాపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
……………………………………………….
