* కొత్త ఆశలతో మళ్లీ జీవితంలోకి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎన్నో కలలు కన్నాడు..జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు.. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలకున్నాడు…ఐఐటిలో సీటు సంపాదించడం అతని ఆశయం.. కానీ ఒక్క రోజులోనే అతని జీవితం తలకిందులైంది.. ఒకే సారి పాతాళంలోకి తోసినట్లుగా అయింది..హఠాత్పరిణామానికి హతాశడయ్యాడు. వివరాల్లోకి వెళితే..వరంగల్ జిల్లా దామెర మండలం పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ జీవితంలో ఐఐటీ లో సీటి సాధించాలనుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2024 నవంబర్ 2 న రాజస్థాన్ కోటాకు పయనమయ్యాడు. రైలులో ప్రయాణిస్తున్న సందర్భంలో గుర్తుతెలియని దుండగులు అతనిపై దాడి చేసి రైలు నుంచి బయటకు తోసేశారు. దాంతో ఆ విద్యార్థి తన రెండు కాళ్లను పూర్తిగా కోల్పోయాడు.రెండు కాళ్లు కోల్పోయి ఇక జీవితం అయిపోయిందనుకున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం తెల్సింది. దీంతో వెంటనే స్పందించిన సీఎం రాహుల్ శస్త్ర చికిత్స చేయించారు. రాహుల్ ఎప్పటిలాగా పనిచేసుఉనే విధంగా రెండు కృత్రిమ కాళ్లను అమర్చాలని డాక్టర్లను ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఆదేశంతో వైద్యులు రాహుల్ కు రెండు కృత్రిమ కాళ్లను అమర్చారు. మళ్లీ యధావిధిగా రాహుల్ తన పనులు చేసుకుంటున్నాడు. రెండు కాళ్లు కోల్పోయిన తనకు మళ్లీ నడవగలిగే విధంగా అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించిన ముఖ్యమంత్రి కి రుణపడి ఉంటామని రాహుల్ అంటున్నాడు. తనకు మళ్లీ జీవితాన్ని ప్రసాదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు రాహుల్ కుటుంబసభ్యులతో కలసి మంగళవారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు,
………………………………………
