
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో చోటుచేసుకుంది. షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్లో బీటెక్ చదువుతున్న తన కుమార్తె మైత్రిని కాలేజీకి పంపించేందుకు బైక్ పై బయలుదేరాడు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని షాద్ నగర్ చౌరస్తా వద్ద ట్యాంకర్ లారీ ఢీ కొట్టింది.మచ్చేందర్ అక్కడికక్కడే మృతిచెందగా కూతురు మైత్రి లారీ టైర్ల మద్య ఇరుక్కొని నరకయాతన అనుభవించింది. అతి కష్టం మీద తన వద్ద ఉన్న సెల్ పోన్ను ఘటనాస్థలి వద్ద ఉన్న ఓ వ్యక్తికి ఇచ్చి ఇంటికి ఫోన్ చేయండని కోరింది.. ఇంతలో ఆమె స్నేహితురాలి వద్దనుండి ఫోన్ రాగా సదరు వ్యక్తి మైత్రి స్నేహితురాలికి జరిగిన సంఘటన గురించి తెలిపాడు. ఆమె స్నేమితురాలి ద్వారా జరిగిన విషయం కుటుంబసభ్యలుకు తెలిసింది. మృత్యువుతో పోరాడిన మైత్రి కూడా కాసేపటికి కన్ను మూసింది. తండ్రీ కూతుళ్ల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………