* సంగారెడ్డి జిల్లాలో విషాదం
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కపూర్లో దారుణం చోటుచేసుకున్నది. భార్య కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా (SANGAREDDY DISTRICT) కొండాపూర్ మండలంలో నివశిస్తున్న సుభాష్ భార్య ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సుభాష్.. తన ఇద్దరు పిల్లలు మారిన్ (13), ఆరాధ్య (10) ఉరివేసి(HANGING) చంపేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య(SUICIDE)కు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘనటా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………………
