ఆకేరు న్యూస్, నిజామాబాద్ : నిజామాబాద్(Nizamabad)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు పాత ఇంటి గోడ కూలడంతో తండ్రి, ఓ పసికందు మృతి చెందారు. కోటగిరి (Kotagiri)మండల కేంద్రంలో మహేశ్ (24) తన భార్య, నెలన్నర కుమార్తెతో నివశిస్తున్నారు. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇంటిగోడ కూలిపోయింది. దీంతో మహేశ్‌తోపాటు చిన్నారి అక్కడికక్కడే మృతిచెందారు. చిన్నారి తల్లి తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………….
