* ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం
* ఒకరు మృతి.. మరొకరి పరిస్థతి విషమం
ఆకేరు న్యూస్, కరీంనగర్ : దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేశాడు. కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కుమారుడు కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన అవవేని మల్లేశం, పోశవ్వ ఉపాధి నిమిత్తం కరీంనగర్‌కు వచ్చారు. ఏడేండ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. మల్లేశంకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశ్రిత్, అర్చన ఇద్దరూ మానసిక వికలాంగులు కావడంతో ఇబ్బందులు తలెత్తాయి. అయితే శనివారం సాయంత్రం తల్లి మార్కెట్‌కు వెళ్లింది. ఈ సమయంలో తండ్రి పిల్లలపై దాడి చేసి చంపేందుకు యత్నించాడు. అపస్మారకస్థితిలో ఉన్న పిల్లలిద్దరిని చికిత్స నిమిత్తం కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అర్చన ప్రాణాలు విడిచింది. అశ్రిత్ చికిత్స పొందుతున్నాడు. మానసిక వికలాంగులైన ఇద్దరు పిల్లల ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేక తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మల్లేశం ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
…………………………………………………………….
