
* యూరియా సరఫరాకు కేంద్రానికి తుమ్మల లేఖ
* అధికారులతో పరిస్థితులపై సమీక్ష
ఆకేరున్యూస్, హైదరాబాద్: రైతులకు ఎరువుల కొరత రాకుండా అందుబాటులో ఉంచాలని
వ్యవసాయశాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఏయే ఎరువుల ఎంతెత అవసరమో స్టాక్ పెట్టుకోవాలన్నారు. అరాష్ట్రంలో ఎరువుల సరఫరా లభ్యతపై రాష్ట్రస్థాయి అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ సంచాలకులు మాట్లాడుతు, గత 5 సంవత్సరాల్లో అత్యధికంగా 2022`23 యాసంగిలో 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడకం ఉన్నదని, దానిని ప్రామాణికంగా తీసుకొని, అంతకంటే ఎక్కువగా యూరియా అందుబాటులో ఉంచేటట్టు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. అక్టోబర్ 1 నుండి ఇప్పటిదాకా కేంద్రం నుండి 8.54 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా ప్రణాళికలు ఇవ్వగా, కేవలము 6.73 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా కాబడినదని, ఇదే విషయాన్ని సీజన్ ఆరంభములో కూడా కేంద్రం ధృష్టికి తీసుకువెళ్లగా, మన రాష్ట్ర అవసరాలను పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు సరఫరా చేసే బాధ్యత తమదని కేంద్రం నుండి భరోసా వచ్చినప్పటికి కేవలం ఫిబ్రవరి మాసములోనే 45 వేల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా రావడం జరిగిందని తెలిపారు. అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్1 న ప్రారంభనిల్వలు 3.08 లక్షల మెట్రిక్ టన్నులను జాగ్రత్తగా సరఫరా చేస్తు, రాష్ట్రం మొత్తం విూద రైతుల అవసరాలకు తగ్గట్టు ఇప్పటిదాకా సరఫరా చేయడం జరిగిందని, ఇకముందు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 1.30 లక్షల మెట్రిక్ టన్నులను అవసరాల మేరకు ఆయా జిల్లాలకు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఇదే సమయంలో మన రాష్టాన్రికి ఈ నెలలో రావాల్సిన యూరియాను వెంటనే ఇతర కంపెనీల ద్వారా సరఫరా చేయుటకు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రిని లేఖ ద్వారా తిరిగి కోరడం జరిగింది. మన రాష్టాన్రికి కేటాయించిన ఎరువులను సరఫరా చేయుటకు కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, కావున రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారి అవసరం మేరకే కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రైతులను కోరారు.
…………………………………………….