
* టెన్త్ విద్యార్థి మృతి
ఆకేరు న్యూస్ డెస్క్ : ట్యూషన్ సెంటర్లో బెంచి ( Bench) కోసం విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మహారాష్ట్ర (Maharastra) లోని నాసిక్ (Nasik) లో శనివారం చోటు చేసుకుంది. సత్పూర్ (satpur) పోలీసులు తెలిపిన కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నాసిక్‌లో శనివారం సాయంత్రం ఓ ట్యూషన్ సెంటర్లో తరగతులకు టెన్త్ విద్యార్థులు హాజరయ్యారు. ఓ బెంచ్ సీటు కోసం ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగి తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘటనలో యశ్రీరాజ్ (Yasriraj) మృతి చెందాడు. ఈ ఘటనపై సత్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
……………………………..