
* మంటలను చిమ్ముతూ.. దూసుకెళ్లి..
* సోషల్‌మీడియాలో వీడియో వైరల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : యూరోప్ కంట్రీ పోలాండ్ (Poland)లో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫైటర్ జెట్ కూలిపోయింది (Fighter Jet Crashes). ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయారు (Pilot Killed). ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సెంట్రల్ పోలాండ్లోని రాడోమ్లో ఎయిర్‌షో కోసం రిహార్సల్ (Airshow Rehearsal) చేస్తుండగా పోలిష్ వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానం (F-16 Fighter Jet) ఒక్కసారిగా కూలిపోయింది. వాయువేగంతో జెట్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలాండ్ ఉప ప్రధాని వ్లాడిస్లా కోసినియాక్ వెల్లడించారు. ఈ మేరకు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు రిహార్సల్స్‌ను తిలకిస్తున్న స్థానికులు జెట్ కూలడాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
…………………………………….