* కమాండ్ కంట్రోల్లో సమావేశం
* కీలకంగా వ్యవహరిస్తున్న ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు
ఆకేరున్యూస్, హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంను కలిశారు. ఈ భేటీలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, అల్లు అర్జున్ అరెస్టు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశం విషయంలో నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
దాదాపు 30 మందికిపైగా సినీ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, సాయి రాజేశ్, సి కల్యాణ్, దామోదర ప్రసాద్, నాగవంశీ, కిరణ్ అబ్బవరం, యూవీ క్రియేషన్స్ అధినేత, రాఘవేంద్ర రావు, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, శివబాలాజి, నాగార్జున, వెంకటేశ్, మురళీ మోహన్, శ్యాం ప్రసాద్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి, డైరెక్టర్ శంకర్, మైత్రీ మూవీస్ అధినేత యలమంచిలి రవి, దగ్గుబాటి సురేశ్, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి, గోపీ ఆచంట, వంశీ పైడిపల్లి తదితరులు ఈ భేటీకి హాజరైనట్లు తెలిసింది. ఇక ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ పాల్గొననున్నారు.
………………………………………