* ముగ్గురికి మూడు రోజుల జైలు.. 37 మందికి నగదు జరిమానా
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా ఎస్సై కమలాకర్ తన సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పస్రా సెంటర్ లో, గోవిందరావు పేట చౌరస్తా లో వాహనాలు తనిఖీ చేయగా, 37 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు వచ్చిందిని ఎస్సై వివరించారు.అనంతరం ములుగు మెజిస్ట్రేట్ జ్యోష్ణ ముందు హాజరుపరచగా విచారణ చేసి 37 మందికి రూ 40000/-వేల రూపాయల జరిమాన మరో ముగురికి 3 రోజుల పాటు జైలు శిక్ష విధించారని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మరియు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు..
………………………………..
