* నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. వీరితో పాటు యంగ్ ఇండియా సంస్థ కూడా కుట్ర, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేసినట్లు ఈవోడబ్ల్యూ అధికారులు పేర్కొన్నారు.వీరందరూ కుట్రపూరితంగా కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులపై హక్కు పొందారని ఆరోపించింది. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న మోతీలాల్ వోరా 2020లో మృతిచెందగా.. ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో మృతిచెందారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసు విషయానికి వస్తే… నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్ (AJL)కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకుందని, రాహుల్, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్ ఇండియా రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్‌కి చెల్లించి ఏజేఎల్‌ను సొంతం చేసుకొన్నట్లు అభియోగపత్రంలో ఈడీ పేర్కొంది.మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఢిల్లీ కోర్టు(Delhi court ) డిసెంబర్ 16కి వాయిదా వేసింది.
……………………………………………..
