* నాలుగు కార్లు, ఆటో దగ్ధం
* స్థానికుల్లో భయాందోళనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. నియోజకవర్గ పరిధిలోని రహ్మత్‌నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ మైదానంలో పార్కింగ్ చేసిన నాలుగు కార్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఫైర్ సిబ్బంది. మరోవైపు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు కావాలనే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
……………………….
