
ఆకేరున్యూస్ ,హైదరాబాద్ : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని బాబానగర్ లో ని ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరిగిన పరిసరాల్లో మంటలు వ్యాపించడంతో స్థానికులు వెంటనే ఆగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించారు. అగ్నిమాపకసిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్లాస్టిక్ కంపెనీ కావడంతో మంటలు త్వరగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో ఉన్న ప్లాస్టిక్ దానా మంటల్లో కాలి బుడిదైంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు.
……………………………