* పెట్రోలు కోసం లైన్లో ఉండగా కారులో..
* తీవ్ర కలకలం సృష్టించిన ఘటన
* త్రుటిలో తప్పిన పెన్రుమాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పెట్రోలు కొట్టించుకోవడానికి బంకులో లైనులో ఉన్న కారులో నుంచి అకస్మాత్తుగా చెలరేగాయి. దీంతో తీవ్ర కలకలం రేగింది. ఇతర వాహనదారులు, బంకు సిబ్బంది ఆందోళన చెందారు. సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పంజాగుట్ట-ఖైరతాబాద్ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. కమలాపురి కాలనీకి చెందిన గోవింద రాజు వద్ద వెంకటేష్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కారులో బయటికి వెళ్ళాడు. ఎర్రమంజిల్లోని భారత్ పెట్రోల్ పంపులో ఆయిల్ నింపుకోవడానికి లైన్లో ఉన్నాడు. అప్పుడే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఆయన కిందికి దిగాడు. పెట్రోల్ బంక్ లోనే కారులో మంటలు చెలరేగడంతో సిబ్బంది, మిగతా వాహనదారులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. తమ వద్ద ఉన్న అగ్నిమాపక పరికరాలతో, నీటితో మంటలు ఆపే ప్రయత్నం చేస్తూనే కారును రోడ్డుపైకి నెట్టేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి వచ్చిన సిబ్బంది మంటలను ఆర్పారు. అప్పటికే కారు లోపలి భాగం, బయట కాలిపోయింది. మంటలు ఆరిపోవడంతో సిబ్బంది, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. అనుకోనిది జరిగి ఉంటే ప్రమాదం ఊహించలేమని అందరూ ఆందోళన చెందారు.
…………………………………
