ఆకేరు న్యూస్, మేడ్చల్ : శామీర్పేటలో ఘోరం జరిగింది. ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. కారు డ్రైవర్ రింగ్ రోడ్డు పక్కన కారు నిలిపివేశాడు. అందులోనే ఉన్న డ్రైవర్ ఏసీ వేసుకొని నిద్రలోకి జారుకున్నాడు. కారులోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్న డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. శామీర్పేట నుంచి కీసరకు వెళుతున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం చోటుచేసుకున్న సంఘటనను పోలీసులకు సమాచారం అందివ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
……………………………………………
