
* ఆరని అగ్గి
ఆకేరు న్యూస్ డెస్క్ : ఐస్లాండ్ రాజధాని రేకియావిక్కు సమీపంలో భారీ అగ్ని పర్వతం బద్దలైంది. భగభగ మండుతూ లావాను వెదజల్లుతోంది. శుక్రవారం రాత్రి ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు ఆ దేశ వాతావరణ విభాగం ధ్రువీకరించింది. ఇప్పటికీ విస్పోటనం కొనసాగుతూనే ఉంది. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా దావనలంలా వ్యాపిస్తోంది. ఆకాశంలోని మేఘాలు ఎరుపు వర్ణాన్ని తలపిస్తున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాన్ని నో ఫ్లైయ్ జోన్ గా ప్రకటించారు. ఆ ప్రాంతం వైపు ఎవ్వరూ వెళ్లకుండా ఐస్ లాండ్ అధికార వర్గాలు ఆంక్షలు విధించాయి.
…………………………………….