
* అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నడుస్తున్నరైలులో మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు అధికారులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడ(Miryalaguda to Kachiguda) కు వెళ్తున్న సమయంలో భువనగిరి మండలం నాగారెడ్డిపల్లి గ్రామాన్ని దాటుతున్న సమయంలో రైలులో పొగలు వచ్చాయి. రైలు కింది భాగంలో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దాంతో రైలును బీబీనగర్ స్టేషన్లో నిలిపివేశారు. ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరుగలేదని అధికారులు తెలిపారు. దాదాపు నుంచి బీబీనగర్ రైల్వేస్టేషన్లోనే రైలు నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నారు.
ప్రైవేటు బస్సులో మంటలు..
మేడ్చల్ మండలం బండ మైలారం నుంచి కొంపల్లికి వెళ్తుండగా ప్రైవేటు బస్సు.. మేడ్చల్ (Mechal) ఐటీఐ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే రోడ్డుకు పక్కన నిలిపివేశాడు. క్షణాలో మంటలు (Fire) బస్సంతా వ్యాపించాయి. కొద్ది సమయంలోనే బస్సు దగ్ధమైంది. బస్సులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సు దగ్ధమైందని డ్రైవర్ తెలిపారు. ఫైర్ సిబ్బంది సంఘటనా మంటలను అదుపులోకి తెచ్చారు. మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………