
* ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం
* బస్సులో 60 మంది ప్రయాణికులు.. ఐదుగురు మృతి
ఆకేరు న్యూస్, డెస్క్ : ఓ డబుల్ డెక్కర్ బస్సులో ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. చాలా మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ (Utharpradesh) లక్నోలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లక్నోలోని మొహన్లాల్గంజ్ సమీపంలో గల కిసాన్పథ్ వద్ద ఢిల్లీ నుంచి బీహార్ (Delhi to Bihar) వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. బస్సులో డోరు వైపు ఉన్నవారు త్వరగానే బయటకు రాగలిగారు కానీ, వెనుకవైపు ఉన్నవారికి ఎమర్జెన్సీ డోరు తెరుచుకోకపోవడంతో బయటకు రాలేకపోయారు. అలాగే డ్రైవర్ సీటుకు సమీపంలో అదనంగా సీటు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. దీంతో మంటలు ఎగిసిపడి చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. అగ్ని ప్రమాదం మొదలైన 10 నిమిషాల్లోనే మొత్తం బస్సు పూర్తిగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. గేర్ బాక్స్ వద్ద స్పార్క్ రావడం వల్ల బస్సులో మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………