* డీజిలు పోసుకుంటుండగా వ్యానుకు నిప్పు
* ఉరుకులు, పరుగులు పెట్టిన వాహనదారులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా పోచారం పరిధి అన్నోజిగూడ పెట్రోలు బంకులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోలు బంకులో వ్యానుకు డీజిల్ పోస్తుండగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకుని వ్యాను పూర్తిగా కాలిపోయింది. వ్యాను సిబ్బంది, పెట్రోలు బంకు సిబ్బంది సురక్షితంగా తప్పించుకున్నారు. సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘట్ కేసర్ నుంచి ఉప్పల్ వెళ్తుండగా ఓమ్మి వ్యానులో ఈప్రమాదం తగ్గింది. అందులో ఐదుగురు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనతో అక్కడ పెట్రోలు పోయించుకోవడానికి వచ్చిన మిగతా వాహనదారులు పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఓ సిలిండర్ పేలినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే పెట్రోలు బంకు సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
……………………………………………………

