
* కార్చిచ్చును ఆపేందుకు వెళ్లిన విమానం కూలి పైలట్ దుర్మరణం
ఆకేరు న్యూస్, డెస్క్ : దక్షిణ కొరియాలో కార్చిచ్చు (Wildfire) దహించి వేస్తోంది. కార్చిచ్చులు రేపిన దావానలం కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు, చెట్లు కాలి బూడిదయ్యాయి. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మరోవైపు ఈ కార్చిచ్చు కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు తీవ్రంగా గాయపడగా.. మరో 13 మంది స్వల్పంగా గాయపడ్డారు. మంటలను ఆర్పేందుకు వెళ్లిన విమానంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ హెలికాప్టర్ కూలి పైలట్ మృతి చెందారు. కార్చిచ్చుల్లో పురాతన బౌద్ద ఆలయం దహనమైంది. కార్చిచ్చు కారణంగా పాఠశాలలను అధికారులు మూసివేశారు. వందలాది మంది ఖైదీలను జైళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. మంటల్లో వందల ఏళ్ల నాటి చారిత్రాత్మ బౌద్ధ ఆలయం (Historic Temples) పూర్తిగా కాలిబూడిదైపోయింది. ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 27 వేల మందికిపైగా నివాసితులను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
……………………………………….