ఆకేరు న్యూస్, డెస్క్ : ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిసింది. బస్తర్ డివిజన్లోని బీజాపూర్, సుక్మా వంటి జిల్లాల్లో కొనసాగుతున్న భద్రతా చర్యలలో భాగంగా కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుక్మా జిల్లాలోని గోలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై అందిన సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, సంఘటన స్థలం నుంచి ఆయుధాలను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………….
