* డీసీపీపై కత్తితో దాడికి యత్నం
* దొంగపై మూడు రౌండ్ల కాల్పులు జరిపిన డీసీపి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిజామాబాద్ లో కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్ చేతిలో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మరువక ముందే హైదరాబాద్ లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ దొంగ ఏకంగా డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి దిగాడు, హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ లోని విక్టరీ గ్రౌండ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. డీసీపీ చైతన్యపై దొంగ కత్తితో దాడికి యత్నంచాడు. దీంతో అప్రమత్తమైన డీసీపీ దొంగపై మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.ఈ ఘటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………….
