
ఆకేరున్యూస్,నాగర్ కర్నూల్ : ప్రమాదవశాత్తు నీటిలో పడి కొట్టుకుపోతున్న యువకుడిని మత్స్యకారులు కాపాడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళ గంగ కు కొంత మంది యువకులు విహారయాత్రకు వెళ్లారు , అయితే ఓ యువకుడు కృష్ణా నది (Krishna River) లోప్రమాదవశాత్తూ లోతైన నీటిలో కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు మిత్రులు ప్రయత్నించినా నీటి ప్రవాహం కారణంగా వారు ఏమీ చేయలేక పోయారు. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు (Local fishermen) వెంటనే నదిలోకి దిగి పడవ సహాయంతో యువకుడిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
……………………………………………