
* మహారాష్ట్ర థానేలో ఘోర ప్రమాదం
ఆకేరు న్యూస్, డెస్క్ : మహారాష్ట్ర థానేలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో గమ్యస్థానం చేరుకుంటామనే లోపే ఐదుగురు రైలు ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఫుట్ బోర్డు ప్రయాణమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ముంబై(Mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి థానే జిల్లాలోని కసార ప్రాంతానికి వెళ్తుండగా, లోకల్ రైలు నుంచి 12 మంది ప్రయాణికులు జారిపడి ట్రాక్ పై పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ముంబ్రా రైల్వే స్టేషన్ సమీపంలో ముంబ్రా-దివా రైల్వే లైన్లో ఈ విషాదం చోటుచేసుకుంది. తీవ్రమైన రద్దీ వల్ల కొందరు ప్రయాణికులు డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించడమే ఇందుకు కారణమని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వారు అదుపుతప్పి కిందపడిపోయారని వెల్లడించారు.
……………………………………….