* ఢిల్లీలో విపత్కర పరిస్థితులు
ఆకేరు న్యూస్ డెస్క్: దేశ రాజధానిఢిల్లీ (Delhi)లోని వాతావరణ పరిస్థితులు స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాయు కాలుష్యానికి తోడు దట్టమైన పొగమంచు(Dense Fog) తో సమస్యలు తలెత్తుతున్నాయి. గురువారం ఉదయం ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ (visibility) దాదాపు సున్నాకి పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 10 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్థితి. గురువారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 7.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. పొగమంచు వల్ల ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది (affect flight operations). దాదాపు 80కిపైగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటి వరకూ ఐదు విమానాలు రద్దయ్యాయి.
……………………………………