* 53 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆకేరు న్యూస్, డెస్క్ : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని బీసీ హాస్టల్ లో (BC Hostel) చోటుచేసుకున్న కలుషిత ఆహారం ఘటన తీవ్ర కలకలం రేపింది. 53 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వైద్యులు పరీక్షించి విద్యార్థులందరూ సేఫ్ గానే ఉన్నారని ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే.. ధర్మవరం(Dharmavaram)లోని బీసీ వసతి గృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా, శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనాలు చేశారు. కాసేపటికే 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వసతిగృహం సిబ్బంది, పోలీసులు వారిని అంబులెన్స్‌లో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకున్నారని, ప్రస్తుతం దవాఖానలో 53 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 53 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
