
* పూర్తిగా మహిళలతోనే భద్రతా ఏర్పాట్లు
* మహిళా శక్తిని చాటేందుకే అన్న కేంద్ర సర్కారు
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈరోజు గుజరాత్లో పర్యటించారు. నవ్ సారీ జిల్లాలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. లఖ్పతి దీదీ పథకం లబ్ధిదారులతో ప్రధానమంత్రి (Prmie Minister)మాటమంతీ కార్యక్రమం గుజరాత్లో కొనసాగింది. ఈ కార్యక్రమానికి పూర్తిగా మహిళా పోలీసులతోనే భద్రత ఏర్పాటు చేశారు. చరిత్రలోనే తొలిసారిగా ఇటువంటి భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు. మహిళా శక్తిని చాటేందుకే ఈ నిర్ణయమన్నారు. దేశంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని చెప్పారు. లోక్ సభ(Loksabha)లో 74 మంది మహిళా ఎంపీలు గెలిచారని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీని కూడా మహిళలు వినియోగిస్తున్నారని వెల్లడించారు. ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాక్ రద్దు చేశామన్నారు. కీలక పదవిల్లో మహిళలను నియమిస్తున్నామని వివరించారు.
…………………………………………………..