
ఆకేరు న్యూస్ డెస్క్ : కర్నాటకలోని చామరాజనగర జిల్లా బొమ్మలాపుర గ్రామానికి చాలాకాలంగా పులి వచ్చి వెళ్తోంది….దీన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు నెల రోజుల కిందట బోను ఏర్పాటు చేశారు…పులిమాత్రం దానికి చిక్కకుండా గ్రామంలో సంచరిస్తోంది. ఫారెస్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వాళ్లందరినీ ఇలా బోనులో బంధించి నిరసన తెలిపారు గ్రామస్థులు. ఎలాగైనా పట్టుకుంటామని అటవీశాఖాధికారులు మాటివ్వడంతో విడిచి పెట్టారు…!!
………………………………………….