
* పరారీలో జర్నలిస్టు కృష్ణం రాజు
ఆకేరున్యూస్ డెస్క్ : టీవీలో చర్చ సందర్భంగా చర్చల్లో పాల్గొన్న
జర్నలిస్టు కృష్ణ రాజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మహిళలపై
వివాస్పద వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో యాంకర్ గా వ్యవహరించిన
ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ రావును పోలీసులు అరెస్ట్
చేశారు. చానల్ లో చర్చ జరుగుతున్న సందర్భగా మహిళలపై జర్నలిస్టు
కృష్ణంరాజు అభ్యంతకర వార్తలు చేశారు. జర్నలిస్టు కృష్ణం రాజు చేసిన
వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. ఈ నేపధ్యంలో రాజధాని అమరావతి రైతులు
మహిళలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కొమ్మినేని శ్రీనివాస్,సర్నలిస్టు
కృష్ణంరాజు,చానల్ యాజమాన్యంపై కేసే నమోదు చేశారు. ఈ నేపధ్యంలో
హైదరాబాద్ లోని జర్నలిస్టు కాలనీలో నివాసం ఉంటున్న కొమ్మినేని శ్రినివాస్ ను
అరెస్టు చేసి ఆంధ్ర ప్రదేశ్ కు తరలించారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు పరాలీలో
ఉన్నట్లు తెలిసింది.
……………………………………………….