* బీజేపీలో చేరిన బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : నాటకీయ పరిణామాల మద్య ఎట్టకేలకు ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు. ఆదివారం కేంద్ర మంత్రి , రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. శనివారం ఆరూరి రమేశ్ బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ అద్యక్షుడిగా కొనసాగుతున్న ఆరూరి రమేశ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ బీఆర్ ఎస్ టికెట్ ఆశించారు. బీఆర్ ఎస్ అధిష్టానం మాత్రం కడియం కావ్య వైపు మొగ్గు చూపారు. దీంతో బీజేపీ వైపు ఆరూరి అడుగులు వేశారు. అమిత్ షా పర్యటన సంధర్భంగా హైదరాబాద్‌లో బీజేపీ అగ్రనేతలను కలిశారు. మరుసటి రోజు హనుమకొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం రసాభాసగా మారింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అద్వర్యంలో ఆరూరి రమేశ్‌ను బలవంతంగా హైదరాబాద్‌కు తీసుకెళ్ళారు. విషయం తెలుసుకుని బీజేపీ శ్రేణులు జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఎర్రబెల్లి కారును అడ్డుకున్నారు. దయాకర్ రావు బీజేపీ శ్రేణుల మద్య తీవ్ర వ్యాగ్యుద్ధం జరిగింది. అనంతరం హైదరాబాద్ కేసీఆర్ వద్దకు దయాకర్ రావు ఆరూరిని తీసుకెళ్ళారు. కేసీఆర్ తో మాట్లాడిన అనంతరం బీఆర్ ఎస్‌లోనే కొనసాగుతానని మీడియాకు చెప్పారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించడం లేదన్నారు. తరం కడియం కావ్యకు బీఆర్ ఎస్ వరంగల్ పార్లమెంట్ టికెట్ కెటాయించారు. దీంతో ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు.
- ఆశావహుల నిరసన